అత్యంత పారదర్శకంగా లొసుగులకు అవకాశం లేకుండా కొత్త రెవెన్యూ చట్టం ఉండబోతుందన్నారు సీఎం కేసీఆర్. కొత్త రెవెన్యూ బిల్లు ద్వారా ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. శాసనసభలో రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన సీఎం… రాష్ట్రంలో 2.75 కోట్ల ఎకరాల భూమి ఉందన్నారు.
కొత్తగా తెస్తున్న రెవెన్యూ చట్టంలో లొసుగులకు అవకాశం లేదన్నారు. కొత్త చట్టంతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం అన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నాలజీ విధానంలో రికార్డులు భద్రంగా ఉంటాయన్నారు. అధికారులంతా చట్టం పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ చట్టంతో 99.99 శాతం ఆస్తుల తగాదాలు ఉండవు అని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలోని వీఆర్వోలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అనివార్య పరిస్థితుల్లోనే వీఆర్వో వ్యవస్థను రద్దు చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. 5485 మంది వీఆర్వోలు ఉన్నారు… వీరందరికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు.
()ఇకపై రెవెన్యూ కోర్టులుండవు
()వ్యవసాయ,వ్యవసాయేతర భూములుగా రిజిస్ట్రేషన్లు
()వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ఎమ్మార్వోల చేతిలో
()వ్యవసాయేతర భూములు యధావిధిగా సబ్ రిజిస్టార్ల చేతిలో
()ఇకపై ఎమ్మార్వోలే జాయింట్ రిజిస్టార్లు
()ధరణి పోర్టల్లో సమగ్ర భూముల వివరాలు
()స్కేల్ ఉద్యోగులుగా వీఆర్వోలు
()ఇకపై రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్ధితి ఉండదు
()భూమి ఈసీ వివరాలు ధరణి వెబ్సైట్లో