కరోనా వైరస్ ప్రభలుతున్న పరిపాలన సౌలభ్యం కోసం ఈ నెల 7 తేదీ నుండి అసెంబ్లీ, మండలి సమావేశాలు నిర్వహించదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..సమావేశాలు ఏ విధంగా నడపాలి అనే విషయంలో ఇప్పటికే మూడు పర్యాయాలు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం..కరోన లక్షణాలు ఉన్న శాసన మండలి,అసెంబ్లీ సభ్యులు సమావేశాలకు రాకూడదు అని కోరుతున్నాము..కరోనా కట్టడికి స్వీయ నియంత్రనే ముఖ్యము అనేది చాలా ముఖ్యము..అసెంబ్లీ సమావేశాలకు వచ్చే శాసన మండలి,శాసన సభ సబ్యులకు, వారి పియస్, పిఏ,సెక్యురిటి, అధికారులకు,మీడియా ప్రతినిధులు అందరికి కరోనా టెస్టులు చేస్తాం…నెగిటివ్ వచ్చిన వ్యక్తులను మాత్రమే సభలోకి అనుమతి ఇస్తామన్నారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ప్రజలకు జవాబుదారులం..సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు అధికారులు తప్పకుండా సమాధానం ఇవ్వాలి..గతంలో పెండింగ్ లో ఉన్న ప్రశ్నలకు కూడా త్వరగా సమాధానాలు ఇవ్వాలని అధికారులను కోరుతున్నాం…రానున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాం…కరోన నియంత్రణ కోసం తమ ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వహించిన పోలీసులకు,వైద్య,పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము…అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాలని అనే దురుద్దేశ్యం తో కొందరు నేతలు ధర్నాలు,నిరసనలు ,చలో అసెంబ్లీ లాంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పోలీస్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలి…దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించని విధంగా ప్రశాంతంగా ,ప్రజలకు జవాబు దారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ,కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తుందన్నారు.అసెంబ్లీ సమావేశాలకు కావాల్సిన ఏర్పాట్లను సీఎస్ అధ్వర్యంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తున్నారు..
- కొరొనా నేపథ్యంలో ఈ సమావేశాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు.పార్లమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ పాటిస్తూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ-మండలి హాల్ లో 6 అడుగుల దూరం వచ్చే విదంగా సీట్లు ఏర్పాటు చేశామని… శాసనసభ లో కొత్తగా 40 సీట్లు–కౌన్సిల్ లో 8 సీట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ- ఎమ్మెల్యే క్వాటర్స్ – అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో రోజు శానిటేషన్ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. అసెంబ్లీలో రెగ్యులర్ గా ఉండే వైద్యులతో పాటు కొరొనా పై అవగాహన ఉన్న వైద్యులను ఏర్పాటు చేస్తున్నాము…ఈసారి సమావేశాలకు ఒక్కో మీడియా సంస్థ నుండి అసెంబ్లీకి ఒకరు, కౌన్సిల్ కు ఒకరు చొప్పున మాత్రమే అనుమతిస్తాం. ఇతర మీడియా సిబ్బందికి అనుమతి లేదు…సమావేశాలకు హాజరయ్యే ఇద్దరు ప్రతినిధులు తప్పనిసరిగా కరోనా టెస్ట్ లు చేయించుకుని నెగెటివ్ రిపోర్ట్ సబ్‌మిట్ చేయాలి.అధికారుల సమావేశంలో సోమేష్ కుమార్ , చీఫ్ సెక్రటరీ, వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (GAD) రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఫైనాన్స్), అరవింద్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (MA&UD), యస్ సి యమ్ రిజ్వీ, ప్రిన్సిపల్ సెక్రటరీ (హెల్త్ డిపార్ట్మెంట్), లోకేష్ కుమార్, కమీషనర్ (GHMC) పాల్గొన్నారు.పోలీసు శాఖ సమావేశంలో DG (SPF), హైదరాబాద్ పోలీసు కమిషనర్, ఇంటెలీజెన్స్ ఐజీ, అడిషనల్ సిపి ట్రాఫిక్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సైబరాబాద్), అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా & ఆర్డర్), అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ హాజరయ్యారు.