యూకే లో నివసిస్తున్న ప్రవాస తెలంగాణ వారందరిని తెలంగాణ అసోసియేషణ్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్(TAUK) ఆవిర్భావ జనవరి 28న లండన్‌లో జరగనుంది. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో టాక్ ఆవిర్భవ పోస్టర్‌ను ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి ఆవిష్కరించారు.
యుకేలోని తెలంగాణ బిడ్డలందరిని ఒకేతాటిపైకి తెచ్చేందుకే టాక్ ఏర్పాటుచేశామని సంస్థ ప్రతినిధి నవీన్ రెడ్డి అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో తమవంతు పాత్ర పోషించామని…నేడు అదే స్పూర్తితో బంగారు తెలంగాణలో భాగస్వాములవుతామని తెలిపారు. టాక్ ద్వారా తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతామన్నారు. టాక్ ద్వారా రానున్న కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో బంగారు తెలంగాణ సాధన దిశగా తమ సహకారం అందిస్తామన్నారు.
ఈ నెల 28న లండన్‌లో జరిగే ఆవిర్భావ సభకు ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డితో పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్ధ ప్రతినిధులు మధుసూదన్ రెడ్డి, శ్వేతా, రాజ్ కుమార్ శానబోయిన, ఓయూ జాక్ చైర్మన్ కరాటే రాజు, టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి , మల్లేష్ యాదవ్, ప్రవీణ్ కుమార్, శశిధర్ చేబర్తి, వసుంధర, తెలంగాణ సోషల్ మీడియా నాయకులు కరుణాకర్ రెడ్డి, తెలంగాణ ఆజాద్ ఫోర్స్ నాయకులు తిరుమందాస్ గౌడ్ మరియు తెలంగాణ సామాజిక నాయకులు ఫణికుమార్ పాల్గొన్నారు.