- Advertisement -
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 96 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1763 పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసులు 95,700కు చేరగా ఇప్పటివరకు 719 కరోనాతో మృతిచెందారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 20,990 యాక్టివ్ కేసులుండగా 73,991 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 1,789 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో 484 పాజిటివ్ కేసులు నమోదుకాగా , మేడ్చల్ మల్కాజ్గిరిలో 169, రంగారెడ్డిలో 166 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 0.7శాతం ఉండగా దేశంలో 1.92శాతంగా ఉంది. గత 24గంటల్లో 24,542 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 7,97,470 మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
- Advertisement -