- Advertisement -
రాష్ట్రములో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల నేపథ్యంలో విద్యుత్ వినియోగదారుల, సాధారణ ప్రజల భద్రత కోసం పలు సూచనలు చేశారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి.
- విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు
- విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగలరు
3.ప్రజలు రోడ్లపై, భవనాలపై తెగి పడ్డ తీగల విషయం లో అప్రమత్తం గా ఉండాలి, వాటిని తాకకుండా విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి
- ఒక వేళ అపార్ట్మెంట్ సెల్లార్లలో వరద నీరు చేరితే వెంటనే సంబంధిత విద్యుత్ వినియోగదారులు విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి
5.ప్రజలు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల, ట్రాన్స్ ఫార్మర్ ల మరియు సర్వీస్ వైర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాటిని తాకకుండా దూరంగా నడవాలి
- వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, ట్రాన్స్ ఫార్మర్ ల వద్ద శబ్దం వస్తుంటే వెంటనే విద్యుత్ శాఖ వారికి తెలియజేయాలి
- Advertisement -