- Advertisement -
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దైంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు స్ధానిక పరిస్ధితులపై ఆరా తీస్తున్నారు ఎమ్మెల్యేలు. తాజాగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్ధితిని సమీక్షించారు మంత్రి సత్యవతి రాథోడ్.
వరదల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే గిరిజనులు, ఆదివాసీలను దగ్గర్లో ఉన్న గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి, అక్కడే పునరావాసం కల్పించాలన్నారు.
- Advertisement -