తెలంగాణ రైతే దేశానికి దిక్సూచి అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,ఎంపీ రాములుతో కలిసి హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ భవిష్యత్ కు భరోసా అన్నారు. పంటల నమోదును రాష్ట్రంలో శాస్త్రీయంగా అమలు చేస్తున్నాం…. దేశంలో ఈ పద్దతి అనుసరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రాష్ట్రంలో సాగు ద్వారా వచ్చే పంటల దిగుబడి అంచనా వేసేందుకే ఈ నమోదు…. సాగు వివరాలు తెలిస్తే కొనుగోళ్లు, ఇతర చర్యలకు అవకాశం ఉంటుందన్నారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో రైతాంగానికి చేయూతనందిస్తాం….నాగర్ కర్నూలు జిల్లాలో మామిడి ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటు చేశామని….రాష్ట్రంలోని ప్రాంతాల అవసరాలు, సాగును బట్టి పరిశ్రమల ఏర్పాటుకు కార్యచరణ ఖరారు చేస్తున్నాం అన్నారు.
పత్తి సాగు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున అవకాశాలున్నాయి .. వాటికి ప్రభుత్వ ప్రోత్సహిస్తాం…రాష్ట్రంలో గోదాములన్నీ పంటలతో నిండిపోయాయి .. అవి ఖాళీ కాకముందే కొత్తపంటలు మార్కెట్లోకి రాబోతున్నాయన్నారు. రాష్ట్రంలో , దేశంలో మొక్కజొన్న నిల్వలు పేరుకుపోయాయి…. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం గత యాసంగిలో మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టిందన్నారు.
మొక్క కొనుగోళ్లతో ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతాంగానికి అండగా నిలిచామన్న తృప్తి కేసీఆర్‌కి ఉందన్నారు. దేశంలో వేల కోట్లు అప్పులు తీసుకున్న వారితో వసూలు చేయలేక కేంద్రం వారి అప్పులను మాఫీ చేస్తుంది… గంజికి లేక వలసపోయిన తెలంగాణ రైతాంగాన్ని చూశాం అన్నారు. ఆరేళ్లలో రైతులు పండించిన పంటలు దాచుకునే జాగ గోదాంలలో లేదు… గత ఏడాది కోటీ 22 లక్షలు, ఈ ఏడాది ఈ వానాకాలంలో కోటీ 35 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతున్నాయన్నారు.
ప్రకృతి కూడా తెలంగాణ ప్రభుత్వ పనితీరును అభినందిస్తూ దీవిస్తుందన్నారు. 60 రోజులలో 45 రోజులు వానలు పడ్డాయి… కేసీఆర్ గారి పాలనకు దేవుడు అందిస్తున్న దీవెనగా భావిస్తున్నాం …కరోనా విపత్తులోనూ రూ.1173 కోట్లు రైతుభీమా కోసం చెల్లించాం…రైతుబంధు పథకం కింద 57 లక్షల పై చిలుకు రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున అందించాం అన్నారు. పాలకమండల రైతుల ప్రయోజనాల కోసం పనిచేయాలి.. అచ్చంపేటకు సాగునీళ్లు అందిస్తాం..ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టిలో ఈ విషయం ఉంది.. ఖచ్చితంగా పుల్జాల – చంద్రసాగర్ కాలువ పనులు పూర్తి చేస్తాం.. అమ్రాబాద్ మండలానికి నీళ్లిచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు.