- Advertisement -
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాతో ఇప్పటికే లక్షన్నర మందికిపైగా మృత్యువాతపడగా పనిలేక వేలాదిమంది రోడ్డున పడ్డారు. దీంతో అమెరికాలో నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది.
ఈ నేపథ్యంలో హెచ్ 1బీ వీసాలను ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. దీంతో టెక్ కంపెనీలు, వివిధ దేశాల నుండి విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాస్త మెత్తబడ్డారు ట్రంప్.
ఇదివరకు పని చేసిన ఉద్యోగాల్లోనే పని చేయడానికి తిరిగి వస్తే వారిని అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా నిషేధాన్ని ప్రకటించడానికి ముందు ఎవరైతే అదే ఉద్యోగాలకు తిరిగి వస్తారో వారికి అమెరికాలోకి ప్రవేశించడానికి కొన్ని నిబంధనలను సడలిస్తున్నట్లు తెలిపింది.పరిపాలన సాంకేతిక నిపుణులు, సీనియర్-స్థాయి నిర్వాహకులు మరియు H-1B వీసాలు కలిగి ఉన్న ఇతర కార్మికుల ప్రయాణానికి కూడా అనుమతించింది.
- Advertisement -