వి సెల్యూట్ సంతోష్ బాబు :పంజాబ్ నేషనల్ బ్యాంకు

263
col santhosh babu
- Advertisement -

భారత్ చైనా సరిహద్దు ప్రాంతం గాల్వన్ లోయలో చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. యావత్ భారతావని అమరజవాన్ల త్యాగాన్ని తలుచుకుంటూ నివాళి అర్పించగా తెలంగాణ ప్రభుత్వం సంతోష్ బాబుకు కుటుంబానికి ప్రభుత్వ స్ధలం,రూ.5 కోట్ల నగదు,సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వ ఉద్యోగాన్నిచ్చింది.

తాజాగా కల్నల్ సంతోష్ చేసిన సేవలను గుర్తుచేస్తూ ఆయన కుటుంబాన్ని సత్కరించింది పంజాబ్ నేషనల్ బ్యాంకు. అశుతోష్ చౌదరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ సౌత్ జోనల్ మేనేజర్‌ మెమొంటో,శాలువాతో సంతోషిని సత్కరించారు.

- Advertisement -