మరో టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీకి కరోనా..!

439
vg goud
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు కేసుల సంఖ్య 80 వేలు దాటగా మృతుల సంఖ్య 627కి చేరాయి. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా తాజాగా మరో ఎమ్మెల్సీ కరోనా బారీన పడ్డారు.

నిజామాబాద్ కి చెందిన ఎమ్మెల్సీ వీజీ గౌడ్ ​కు కరోనా పాజిటివ్​ అని తేలింది. ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ కావడంతో వారంతా హోం ఐసోలేషన్ లోకి వెళ్ళారు. శనివారం నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేష్ గుప్తా,వివేకానంద గౌడ్,జీవన్ రెడ్డి,మంచిరెడ్డి కిషన్ రెడ్డి,నల్లమోత భాస్కర్‌ రావులకు కరోనా సోకిన సంగతి తెలిసిందే.

- Advertisement -