కృష్ణా జలాల పైన తమ చట్టబద్ధ హక్కులను పైన పోరాటం కొనసాగుతుందని, ఇప్పటికే సుప్రీం కోర్టులో స్పేషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు తెలిపారు మంత్రి కేటీఆర్. ట్విట్టర్ లో ఆస్క్ కెటియార్ (#AskKtr)పేరిట ప్రజలతో సంభాషించారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలక సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్తో తమకు సత్సంభాధాలున్నాయని కానీ రాష్ట్ర హక్కుల పైన ఏలాంటి రాజీ ఉండబోదని తెలిపారు.
పెద్ద ఎత్తున కరోనా చికిత్సకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పైన ఇప్పటికే చర్యలు తీసుకున్నామని, అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని తెలియ చేశారు అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సందర్భంగా కోరారు. ప్రయివేట్ ఆసుపత్రులు నిరాకరించిన వారికీ సైతం ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సా అందిస్తున్నారని, ప్రభుత్వ వైద్యసిబ్బంది సేవలకు ప్రజలు మరింత గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పటికే సుమారు 1200 పైగా సెంటర్లలో కరోనా టెస్టింగ్ జరుగుతుందని, ప్రస్తుతం రోజుకు 23 వేలకు పైగా కొనసాగుతున్న టెస్టుల సంఖ్య రానున్న రోజుల్లో 40 వేలకు పైగా పెరిగే అవకాశం ఉందని తెలియజెప్పారు. కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉన్నదని, రికవరీ రేటు దేశంలోని అత్యుత్తమంగా 72 శాతంగా నమోదవుతుందని తెలిపారు. కేవలం ప్రభుత్వ ఆస్పత్రిలో పైన వస్తున్న వ్యతిరేక ప్రచారమే కాకుండా ఆ సంస్థలు చేస్తున్న సేవలు కూడా గుర్తించాలని, ఇప్పటికే వేలాది మందికి చికిత్స అందించి ఇంటికి సురక్షితంగా పంపించారన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం సందర్భంగా వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, ఇది కేవలం తెలంగాణకే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంశంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చినాక అనేక రకాల కార్యక్రమాలు చేపట్టామని శిశు, మాత మరణాలు తగ్గించగలిగామని, ఐదు నూతన మెడికల్ కాలేజ్ లను ప్రారంభించడంతో పాటు పలు ఏరియా ఆసుపత్రిలో ఐ సియూ యూనిట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. 40కిపైగా డయాలిసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. దీంతోపాటు 200కు పైగా హైదరాబాద్లో పని చేస్తున్నాయని తెలిపారు.
కొవిడ్ పైన జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా కూడా ప్రభుత్వంతో కలిసి రావాలని కేవలం ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోతుదని, ముఖ్యంగా ప్రజలు భయాన్ని, దుష్ప్రచారాన్ని వదిలిపెట్టి కోవిడ్ ను ఎదుర్కోవాలని, రోగుల పట్ల సానుభూతితో ఉండాలని సూచించారు.