80 వేలకు చేరువలో కరోనా కేసులు…

208
coronavirus news
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1,982 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 12 మంది మృతిచెందినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ఇక ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 79,495కు చేరగా ప్రస్తుతం రాష్ట్రంలో 22,869 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా మహమ్మారి నుండి 55,999 మంది కోలుకోని డిశ్చార్జ్ కాగా 627 మంది మృత్యువాతపడ్డారు.

జిల్లాల వారీగా గత 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా గ్రేటర్‌ పరిధిలో 463 పాజిటివ్‌ కేసులు, మేడ్చల్‌లో 141, రంగారెడ్డిలో 139, కరీంనగర్‌లో 96, జోగులాంబ గద్వాలలో 93, జనగామలో 78, పెద్దపల్లిలో 71, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 71 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

- Advertisement -