వరంగల్ పీఎంఎస్ఎస్వై నిధులతో నూతనంగా నిర్మించిన 250 పడకల ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం కోవిడ్ పేషేంట్లకు చికిత్స అందించేందుకు 120 బాడ్స్ సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ఎర్రబెల్లి.ఈ నెల 12వ తేదీన హాస్పిటల్ ను ప్రారంభిస్తాం…వైద్యులు- ఉద్యోగులు ప్రాణాలకు తెగించిసేవలు అందిస్తున్నారని చెప్పారు.
ఎంజీఎం లో ఇప్పుడున్న కోవిడ్ వార్డుతో పాటు అదనంగా మరో 200 బెడ్స్ ఏర్పాటు చేయబోతున్నాము…కరోనా సమస్యను రాజకీయం చేయవద్దు.. అబద్ధాలు-తప్పుడు ప్రచారాలు మానుకోవాలి..మాజీ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు కేవలం ఆరోగ్యం బాగులేక పోవడం, ఆయన కుటుంబ సభ్యులు అంతా కరోనా బారిన పడడం వల్లే ఆయన రాజీనామా చేశారు.
ఆ రాజీనామాను రాజకీయం చేయవద్దు…కరోనా రోగులు ఎలాంటి ఆందోళన చెందవద్దు..ప్రజలు కరోనా బాధితులను శత్రువులుగా, అంటరాని వారిగా చూడడం సరికాదన్నారు.ఎంజీఎంలో ప్రతి కరోనా పేషేంట్ ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా శ్రమిస్తున్నాము…ప్రైవేటు ఆస్పత్రులు కూడా సేవలు అందించేందుకు ముందుకు రావడం శుభ పరిణామం…స్వచ్ఛంద సంస్థలు,వాలేంటర్లు సహాయ సహకారాలు అందించాలన్నారు.