జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది .. ప్రపంచ సమాచార సాధనం , మానవునికి ఏదైనా సమాచారం కావలి అంటే గూగుల్ ని అడగకుండా ఉండలేం .. అలాంటి సంస్థకి డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాహుల్ జిందాల్ తన నివాసం , ఛత్తీస్గఢ్ లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ చేశారు.అర్జిత్ సర్కార్ విపి గూగుల్ విసిరినా ఛాలెంజ్ స్వీకరించి ఛత్తీస్గఢ్ తన నివాసం లో మొక్కలు నాటారు.
ఈ సందర్బంగా రాహుల్ జిందాల్ గారు మాట్లాడుతూ మనకు జీవించటానికి భూమి ఒక్కటే ఆధారం , మనకు వేరే ఆధారం ఇప్పటివరకు లేదు , ఆలాంటి భూమిని కాపాడాలి అంటే విరివిగా మొక్కలు నాటాలి ,మన అవగాహనా లోపం తో మనం మొక్కలు నాటడం అశ్రద్ధ చేస్తున్నాం కానీ అల చేయకుండా ఈ ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో పాల్గొనాలన్నారు.
తనకు బుద్ధుడు అన్న , అయన ప్రవచనాలు అన్న చాలా ఇష్టం , దాని ప్రకారం బుద్దుడి జీవితం ప్రతి మొక్కలో చెట్టు వేరులో , కాండంలో , గాలిలో జీవించి ఉంటారు అందుకే అందరు మొక్కలు నాటాలి…. ఇలాంటి అద్భుత కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా … ఈ కార్యక్రమం ఇలానే ముందుకు కొనసాగడానికి తన వంతుగా మరో ముగ్గురు శశాంక్ శైన్,గ్లోబల్ చాంపియన్ ఆపరేషన్స్, శ్రీరామ్ మంగుడి,సుభాజిత్ దుబి,రాధిక దేష్ పాండేకి గ్రీన్ ఛాలెంజ్‌కి నామినేట్ చేశారు.