ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతుంది.మానవాళిని భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్. దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోవడం జరుగుతుంది..దహన సంస్కారాల గురించి కొన్ని గ్రామాల్లో అడ్డుపడటం జరుగుతుంది..ఇది సరైన పద్ధతి కాదు..కరోనా వైరస్ చనిపోయిన వ్యక్తి మీద ఉన్నప్పటి కూడా మనిషి దగ్గితే తుమ్మితే వస్తుంది చనిపోయిన వ్యక్తి నుండి వచ్చే అవకాశం తక్కువ అన్నారు.
చనిపోయిన తర్వాత భౌతికకాయం నుండి వైరస్ ప్రబలకుండ ఆసుపత్రి సిబ్బంది ,వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు…గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అందరూ అంతిమ యాత్రలో పాల్గొంటారు బాధపడతారు అలాంటి గొప్ప సంస్కృతి మనది..కొంతమంది కడుపులో పుట్టిన బిడ్డలు కూడా భయబ్రాంతులకు లోనవుతున్నారు..భౌతికకాయాన్ని ఊర్లోకి రానీయకుండా చేయడం అనేది తప్పు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ వల్ల మరణాలు సంభవిస్తున్నాయన్నారు.
అమెరికా తో పాటు ఇతర బీద దేశాలు ,అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో కూడా కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయి దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి.అతి త్వరలో మన శాస్త్రవేత్తలు దీనికి వ్యాక్సిన్ కనుగొంటారు..మనమందరం బ్రతకాలి మానవజాతిని కాపాడుకోవాలి ..
మళ్ళీ పత్రికలలో ,టివి లలో కానీ ఇలాంటి సంఘటనలు చూడకూడదు..అంతిమ యాత్రను వ్యతిరేకించద్దు అదే సమయంలో ఎక్కువ మంది పాల్గొనవద్దు మర్యాద పూర్వకంగా జరపాలి..కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అంతిమయాత్ర లో , వివాహల్లో కానీ అతి తక్కువ సంఖ్యలో పాల్గొనాలి..
యెల్దండి విజయ్,అంటువ్యాధుల నిపుణులు ఎవరికైనా జబ్బు వచ్చినప్పుడు వాళ్ళని చిన్న చూపు చూడవద్దు.కోవిడ్ కి ఎవరూ బయపడవద్దన్నారు.
కోవిడ్ వచ్చిన వాళ్ళకు వైరస్ వచ్చి పోతే వాళ్ళ నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు.కోవిడ్ మృతదేహాల విషయంలో కూడా ఎలాంటి ఆందోళనలు చెందకూడదు..మాస్కలు ధరించి భౌతిక దూరం పాటిస్తూ అంత్యక్రియలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవచ్చు..ఎవ్వరు బయపడవద్దు చనిపోయాక దీని ప్రభావం తక్కువగా ఉంటది..గ్రామీణ ప్రాంతాల్లో అంత్యక్రియలు అడ్డుకోవడం సరికాదు…కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అంత్యక్రియలు జరుగుతాయి ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.