బిగ్ బాస్ 4…హోస్ట్‌గా నాగ్‌!

149
nagarjuna
- Advertisement -

తెలుగులో 3 సీజన్‌లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ 4వ సీజన్ కోసం సిద్ధమవుతోంది. త్వరలో బిగ్ బాస్ 4 ప్రారంభమవుతుందని స్టార్ మా అఫిషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక స్టార్ మా ప్రకటించిన దగ్గరి నుండి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతుండగా తాజాగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. బిగ్ బాస్ 3వ సీజన్‌లో వ్యాఖ్యాతగా అదరగొట్టిన కింగ్ నాగార్జునే ఈ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.

ఇందుకు సంబంధించిన యాడ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుగుతుండగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్‌లను ఎంపిక చేయగా వారిని 14 రోజుల ముందు క్వారంటైన్‌లో ఉంచి తర్వాత బిగ్ హౌస్‌లోకి పంపనున్నారు. త్వరలోనే టీజర్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

- Advertisement -