దండాలయ్య..! హరీశన్న..!!

499
Harish
- Advertisement -

శ్రావణ మాసం.. శుక్రవారం కొత్తింట్లకు పోయిన సంబురంలో పరవశించిన నాంచారుపల్లి ఎస్సీ కాలనీ, గంగిరెద్దుల కాలనీ ప్రజలు తల రాతలు రాసేది బ్రహ్మ దేవుడైతే తమ లాంటి పేదోడికి గూడు కల్పించిన సీఏం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులు కూడా తమకు అభినవ బ్రహ్మ దేవులేనని నాంచారుపల్లికి చెందిన ఎస్సీ కాలనీ, గంగిరెద్దుల కాలనీ ప్రజలు వేవేల జేజేలు పలికారు.

మొన్నటి దాక గుడిసె..! ఇవాళ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వచ్చాయని, నిన్నటి దాక దశ దిశ లేని తమ జీవితాలకు.. తెలంగాణ సర్కారు దేవుడిలా వచ్చి గుడిసె బదులు గూడునిచ్చిందని పల్లె ఎస్సీ, గంగిరెద్దుల వాసులైన నుంచి సంబురం వ్యక్తమైంది. మా కలల కూడ ఊహించని.. ఇండ్లిచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సార్లు పది కాలాల పాటు సల్లంగా ఉండాలని ఎస్సీ కాలనీ, గంగిరెద్దుల కాలనీ వాసులు దీవెనలిస్తున్నరు.

  • ప్రతి ఇంటా మామిడి తోరణాల అలంకరణ ఓ వైపు కరోనా క్లిష్ట సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం తమ పల్లెలోని పేదలు గౌరవాన్ని పొందేలా చేసి, సామూహిక గృహా ప్రవేశాలకు హాజరైన తమ ప్రియతమ మంత్రి గ్రామంలో అడుగుపెట్టడంతో పరవశించి పోయారు.

డప్పు చప్పుళ్లతో.. మరోవైపు సంప్రదాయ బద్ధంగా మంగళ హారతులు పట్టి కుంకుమ తిలకం దిద్దుతూ.. ప్రతి ఇంటా ఆడ పడుచుల ఆనందోత్సాహాల నడుమ మహిళల జయ ధ్వానాలు, యువకుల కేరింతలు, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పల్లె వాసులంతా హరీశ్ రావును ఆహ్వానించిన ఆ సన్నివేశం నిజంగా సంబురమయమైన ఘట్టం. శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం సరిగ్గా ఉదయం 11.40 గంటలకు గృహ ప్రవేశాలు మొదలై ప్రతి ఇంటా గుమ్మడికాయ కొడుతూ.. కొత్త ఇంట్లో దేవుడికి పూజలు చేసి, నూతన గృహాల్లో శుభ సూచకంగా ప్రతి గృహాల్లో సత్యనారాయణ వ్రతం కథలు జరుపుకున్నారు. ప్రతి ఇంటా మామిడి తోరణాలు, బంతిపూలతో గృహాలను అలకరించిన తీరుతెన్నులు చూసి కొత్త ఇంట్లోకి వచ్చారూ.. ఎట్లా అనిపిస్తుందని లబ్ధిదారులతో మంత్రి హరీశ్ ఆత్మీయంగా ముచ్చటించారు. నాంచారుపల్లిలో ఎస్సీ కాలనీ, గంగిరెద్దుల కాలనీల్లో నిర్మించిన

36 గృహాల్లో మంత్రి పర్యటనలో తండా ప్రజానీకం ఆద్యంతం ఉత్సహంగా, అట్టహాసంగా ఉల్లాసంగా కనపడ్డారు. నాంచారుపల్లి ఎస్సీ కాలనీ, గంగిరెద్దుల కాలనీల్లో ఈ మొదటి నుంచి ఆ చివరి దాకా గృహా ప్రవేశాలు జరిపిన అభిమాన నేత హరీశ్ రావుకు వెన్నంటే ఉంటూ బ్రహ్మరథం పట్టిన పల్లె వాసులకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -