వలిగొండ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌గా కొనపురి కవిత

1024
konapuri ramulu
- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా కొనపురి కవితను నియమించింది తెలంగాణ ప్రభుత్వం.మాజీ మావోయిస్టు కార్యదర్శి ,దివంగత టీఆర్ఎస్ నాయకులు కొనపురి సాంబశివుడు తమ్ముడు కొనపురి రాములు భార్య కవిత.

మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సాంబశివుడు తర్వాత లొంగిపోయి ప్రత్యేక తెలంగాణ కోసం టీఆర్ఎస్‌లో చేరారు. ఆయన తమ్ముడు కొనపురి రాములతో కలిసి నల్గొండ జిల్లాలో ధూంధాం సభలు నిర్వహించారు. ఈ క్రమంలో దుండగులు సాంబశివుడు తర్వాత రాములుని హతమార్చారు.

- Advertisement -