- Advertisement -
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడయ్యారు. ఆదివారం రాత్రి 8.30 గంటలకు తన ప్రియురాలు షాలిని మెడలో మూడుముళ్లు వేశారు. హైదరాబాద్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరువర్గాల కుటుంబసభ్యులతో పాటు అతికొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకకు హాజరైన ప్రముఖులు నూతన వధువరులను ఆశీర్వదించారు.
వాస్తవానికి ఏప్రిల్ 16న నితిన్ వివాహం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ప్లాన్ చేశారు కానీ అది సాధ్యపడలేదు.
నాగర్‌కర్నూల్‌కు చెందిన డాక్టర్ సంపత్ కుమార్,నూర్జహాన్‌ల కుమార్తు షాలిని. కొంతకాలంగా షాలినితో ప్రేమలో ఉన్న నితిన్ తన ప్రేమ విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. జూలై 22న నితిన్- షాలిని ఎంగేజ్‌మెంట్ జరిగింది.
- Advertisement -