కరోనాపై చిల్లర రాజకీయాలు సరికాదన్నారు మంత్రులు ఈటల రాజేందర్, ప్రశాంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్లో వైద్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వారు ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇస్తే పాటిస్తాం… కోవిడ్ ను అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధిస్తుందన్నారు. కరోనాను అరికట్టడం లో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించొద్దన్నారు.
మనదేశంలో లో కేవలం 3 శాతమే మరణాల రేటు ఉందని… అదే మన రాష్ట్రంలో కేవలం ఒక శాతానికే పరిమితమైందన్నారు. కొందరు కావాలని అని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపిన మంత్రులు …కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 450 బెడ్ లకు ఆక్సిజన్ సరఫరా చేసే విధంగా ఉన్నాయని…. 24*7 డాక్టర్లు సేవలు అందిస్తున్నారుని తెలిపారు. ప్రతి ఇంట్లో ఆరోగ్య కార్యకర్తలు సర్వే చేసి ఏమైనా లక్షణాలు ఉంటే ఆస్పత్రులకు తరలిస్తున్నారు….గ్రామీణ ప్రాంతాల్లో కరోనా విస్తరిస్తుంది కావున ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.

