హరితేజ.. తెలుగు బుల్లితెరపై సీరియళ్లు చూసే ప్రేక్షకులకు సుపరిచితురాలు. తనదైన నటనతో తక్కువ టైంలోనే నటిగా ప్రూవ్ చేసుకుంది హరితేజ. తాజాగా ఓ ఇంటర్వూలో ఈ నటి తన జీవితంలోని కొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులను రివీల్ చేసింది.
తిరుపతిలో పుట్టి, పెరిగిన హరితేజ.. హైదరాబాద్‌లో సెటిల్ అయ్యింది. ఆమె వివాహం చేసుకుంది దీపక్ అనే ఓ కన్నడ వ్యక్తిని. ఉద్యోగ రీత్యా దీపక్ బెంగళూరులోనే ఉంటున్నారు. తెలుగు బుల్లితెరపై బిజీ ఆర్టిస్టు అయిన హరితేజ హైదరాబాద్ లోనే ఉంటోంది. ప్రతీ వీకెండ్ కు దీపక్ హైదరాబాద్ వచ్చి పోతూ ఉంటారట. పెళ్లయిన నాలుగైదు రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం మా ఆయనొస్తాడు.. ఎక్కడికైనా బయటకు తీసుకెళ్తాడు అని హరితేజ ఎదురుచూస్తూ ఉండగా… దీపక్ ఓ ట్రాక్ వేసుకుని, షూస్ వేసుకుని నేను జిమ్‌కు వెళ్తున్నా వస్తావా? అడిగాడట. దానికి జిమ్మా?.. నాలుగు రోజులైందిరా పెళ్లయి అని తిట్టుకుని, నేను రాను అని చెప్పి ఇంట్లోనే బాగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట.
దీపక్ తీరుతో వాళ్ల అమ్మకు ఫోన్ చేసి బాగా ఏడ్చేదట హరితేజ. ఏంటమ్మా ఇంత ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్లడం లేదు. జిమ్ అని ఎప్పుడూ అక్కడే పడుంటాడు అని, వాళ్ల అమ్మకు కంప్లయింట్ చేస్తే..సర్లెమ్మా.. పర్లేదు. అబ్బాయిలు మెల్లగా మారుతారు. అని హరితేజకే క్లాస్ ఇచ్చిందట ఆమె. ఆ తరువాత జిమ్ విషయంలో దీపక్ మారలేదు. దీంతో తానే మారి, జిమ్‌కు వెళ్లడం మొదలెట్టానని హరితేజ అసలు విషయాన్ని బయటపెట్టింది.