మొక్కలు నాటిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ అరిజిత్ సర్కార్

282
gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముడవ విడతలో కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా ముందుకు కొనసాగుతోంది దీనిలో వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు; సాప్ట్ వేర్ కంపెనీల దిగ్గజాలు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం జరుగుతుంది.

ఇందులో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన గూగుల్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ అరిజిత్ సర్కార్ మోకిలా లోని తన నివాసంలో 14 మొక్కలు నాటారు. ఈ విషయాన్ని తన లింక్ డిన్ (LINK DIN) ద్వారా వెల్లడించారు.

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని అరిజిత్ సర్కార్ పేర్కొన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మరొక ముగ్గురికి మాధురి దుగ్గిరాల సీనియర్ డైరెక్టర్ గూగుల్, రాహుల్ జిందాల్ డైరెక్టర్, హీనా రావల్ డైరెక్టర్ లను ఈ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదే విధంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -