- Advertisement -
సీఎం కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోందన్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. మిషన్ భగీరథ పథకాన్ని అన్ని రాష్ట్రాలు అధ్యయనం చేయాలని జాతీయ జల మిషన్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాయడం పై మాజీ ఎంపీ కవిత ట్విట్ చేశారు.
మిషన్ భగీరథ ద్వారా ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగించి, తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటికి మంచినీటిని అందిస్తున్న తెలంగాణ మోడల్ ను అన్ని రాష్ట్రాలు ఆధ్యయనం చేయాలని, జాతీయ జల్ జీవన్ మిషన్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాయడం తెలంగాణ బిడ్డగా గర్వకారణంగా ఉందన్నారు మాజీ ఎంపీ కవిత.
- Advertisement -