ఏపీలో 30 వేలకు చేరువలో కరోనా కేసులు…

191
india coronavirus cases
- Advertisement -

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. రోజుకు దాదాపు 2 వేలకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1933 కరోనా కేసులు నమోదుకాగా చికిత్సకు కోలుకొని 846 మంది దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు.

24 గంటల్లో 19 మంది చనిపోగా ఇప్పటివరకు 328 మంది మృతిచెందినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఏపీలో ఇప్పటివరకు 29,168 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 15,412 మంది చికిత్సకు కోలుకొని దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు.

13,428 మంది దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 24 గంటల్లో కర్నూల్‌, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.

- Advertisement -