- Advertisement -
బాలీవుడ్ సూపర్ స్టార్,బిగ్ బీ అమితాబ్ బచ్చన్,ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్‌లకు కరోనా సోకింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, స్టాఫ్ కరోనా టెస్టులు చేయించుకున్నారు. అమితాబ్ కొడుకు, నటుడు అభిషేక్ బచ్చన్ కూడా పాజిటివ్ అని
అమితాబ్ కి కరోనావైరస్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత కొన్ని గంటల్లోనే అభిషేక్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తనకు కరోనావైరస్ సోకినట్టు ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్న అమితాబ్.. కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారని.. రిపోర్టులు రావాల్సి ఉందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా గత 10 రోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా బిగ్ బి కోరారు.
- Advertisement -