ప్రతిపక్షాల విమర్శల్లో పసలేదు: మేయర్ బొంతు

355
bonthu rammohan
- Advertisement -

రాష్ట్రంలో గత ఆరేళ్లుగా ప్రజలు కర్ఫ్యూ అనే పదం మరచిపోయారని తెలిపారు మేయర్ బొంతు రామ్మోహన్‌. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన సచిలయం లో జరిగిన ఘటన పై సీఎం కెసిఆర్ మత పెద్దల తో మాట్లాడారని తెలిపారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీసేలా ప్రవర్తించమని కెసిఆర్ ఇప్పటికే స్పష్టం చేశారని
…దేశం లో ఇలాంటి ఘటన ఎపుడూ జరగ లేదన్నట్టుగా కాంగ్రెస్ ,బీజేపీ లు మాట్లాడుతున్నాయన్నారు.

గుజరాత్ లో మోడీ సీఎం గా ఉండగా రోడ్ల విస్తరణకు పెద్ద పెద్ద ప్రార్థనా మందిరాలు సైతం కూల్చేశారు…సచివాలయం లో ప్రార్థనా మందిరాలు అద్భుతంగా నిర్మిస్తామని ఇప్పటికే సీఎం కెసిఆర్ స్పష్టం చేశారు…మత పెద్దలు సంతృప్తి చెందినా కాంగ్రెస్ ,బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

హై కోర్టు ఆదేశాలకనుగుణంగానే సచివాలయం లో కూల్చివేతలు జరుగుతాయి…చిన్న చిన్న అంశాల పై రాజకీయం చేయడం తగదు…ప్రజలు ప్రతిపక్షాల విమర్శల్లో పస లేదని ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు…హైదరాబాద్ లో మత సామరస్యానికి భంగం వాటిల్లనివ్వం…ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు. మత కల్లోలాలు రేపడమే ప్రతిపక్షాల పని -దానికి అనుమతివ్వము…సచివాలయ నిర్మాణం పర్యావరణ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతుంది…సచివాలయం శిథిలాలు తిరిగి వినియోగించుకునేలా జీడిమెట్ల లో ప్రత్యేక ప్లాంటు నెలకొల్పాం…పాలనా సౌలభ్యం కోసమే కొత్త సచివాలయం నిర్మాణం జరుగుతుందన్నారు.

కొత్త సచివాలయం నిర్మాణం తెలంగాణ అభివృద్ధికి ప్రతీక అన్నారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ ,బీజేపీ నేతలు కొత్త ఇండ్లు కట్టుకోవడం లేదా ?…తెలంగాణ అంతటికీ ఉపయోగ పడే సచివాలయం ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ?అని ప్రశ్నించారు. పోతి రెడ్డి పాడు నుంచి నీళ్లు తరలిస్తున్నా అప్పట్లో మౌనం వహించిన నేతలు ఇపుడు ఎవరికీ నష్టం లేని సచివాలయ కూల్చివేత పై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాల తీరు ఇలానే ఉంటే ఇపుడున్న సీట్లు కూడా వాటికి రావు…ప్రతిపక్షాలు జాగ్రత్తగా వ్యవహరించాలి ,ప్రజలను నష్ట పరిచే చర్యలు చేయకూడదన్నారు.

- Advertisement -