నిర్మాతగా మారనున్న మాస్ మహారాజా!

190
raviteja
- Advertisement -

అసిస్టెంట్ డైరెక్టర్ నుండి స్టార్ హీరోగా ఎదిగారు మాస్ మహారాజా రవితేజ. 50 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోలకు ధీటుగా సిక్స్ ప్యాక్‌తో వరుస సినిమాలు చేస్తున్న రవితేజ…త్వరలో కొత్త అవతారం ఎత్తనున్నాడు.

మహేష్, ప్రభాస్, రామ్ చరణ్, నాని, నాగశౌర్య బాటలోనే నిర్మాతగా మారనున్నారు. త్వరలోనే ఓ ప్రొడక్షన్ హౌజ్‌ని స్ధాపించి సినిమాలు నిర్మించే పనిలో ఉన్నారట రవితేజ. ఇందులో భాగంగా తన తర్వాతి సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోకుండా స్లిపింట్ పార్ట్‌నర్‌గా ఉండనున్నారట. దీని తర్వాత తన సొంత బ్యానర్‌లో సినిమాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట. ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నాని… వాల్ పోస్టర్ సినిమాస్,రామ్ చరణ్‌…కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ,ఎంబీ ఎంటర్టైన్ మెంట్స్ పేరుతో మహేశ్‌ సినిమాలు నిర్మిస్తున్నారు. మరివీరిబాటలోనే నిర్మాతగా మారనున్న రవితేజ ఎలాంటి సక్సెస్ రాబడుతాడో వేచిచూడాలి.

- Advertisement -