- Advertisement -
మంకీ ఫుడ్ కోర్టులతో కోతుల బెడదకు చెక్ పెట్టామన్నారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె అని సీఎం కేసీఆర్ ఇచ్చిన నినాదంతో హరితహార కార్యక్రమంలో మంకీ ఫుడ్ కోర్ట్సు ఏర్పాటు చేశామని తెలిపారు.
మామడ మండలం కొరిటికల్ గ్రామంలో మంకీ ఫుడ్ కోర్టులో మొక్కలు నాటిన ఆయన…సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా కోతుల బెడదను తప్పించేందుకు పండ్ల మొక్కలను పెంచుతున్నామని వెల్లడించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అడవుల పునరుజ్జీనానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందన్నారు.
దీంతో కోతులకు సరిపడా ఆహారం దొరుకుతుందని ఫలితంగా గ్రామాల్ఓ,పట్టనాల్లో కోతుల సంచారం తగ్గుతుందన్నారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలను బతికించే బాధ్యత ప్రజాప్రతినిధులు,అధికారులపై ఉందన్నారు.
- Advertisement -