ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్‌కు ఘన నివాళి అర్పించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో వైఎస్ సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇక వైఎస్ బర్త్ డే సందర్భంగా కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు జగన్. వైఎస్ మరణం లేని నేత అని…ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి పథకాల రూపంలో మహానేత ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారన్నారు.
కడప ట్రిపుల్ ఐటీలో నిర్మించిన వివిధ ఇంజినీరింగ్ విభాగాలతో పాటు మూడు మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు జగన్. అలాగే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆడిటోరియం, కంప్యూటర్ సెంటర్లకు భూమి పూజ చేసి సిలా ఫలకాలు ఆవిష్కరించనున్నారు.