రైతు సుభీక్షంగా ఉంటేనే రాజ్యం సుభీక్షం:నిరంజన్ రెడ్డి

331
niranjan reddy
- Advertisement -

రైతు సుభిక్షంగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, మారెపల్లి, తాడూరు మండలం బలాన్ పల్లి, యాదిరెడ్డిపల్లి గ్రామాలలో రైతువేదికలకు శంకుస్థాపన చేసి పలు కమ్యూనిటీ హాల్లు ప్రారంభించారు. అనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిరంజన్ రెడ్డి….ప్రపంచానికి అన్నం పెట్టే రైతుకే కేసీఆర్ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం …. మనకు అన్నంపెట్టిన రైతే మన దేవుడు అన్నారు. వారికి గుర్తింపు ఇస్తేనే మనను మనం గుర్తించుకున్నట్లు అని వెల్లడించారు. 56.94 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చామని ఇందుకోసం రూ. 7183 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని తెలిపారు. కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్నే స్తంభింపజేసిందని…ఇంత ఇబ్బంది ఉన్నా ఎకరాకు రూ.5 వేల చొప్పున అందించారని తెలిపారు. సంక్షోభంలోనూ అన్ని పంటలను కొంటామని ప్రభుత్వం తరపున గ్రామాలకే వచ్చి పంటలు కొనడం, డబ్బులు విడుదల చేయడం జరిగిపోయిందన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి తెలంగాణ చేయూతనందించామని… వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా చూశామన్నారు. రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల భీమా సొమ్ము అందజేశామన్నారు. ఐదెకరాల రైతుకు తెలంగాణలో రైతుబంధు, ఆసరా ఫించన్ తో కలిపి ఏడాదికి రూ.74 వేల నగదు ప్రభుత్వం ద్వారా అందుతుందన్నారు.

దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి పథకాలు లేవని… సంక్షేమం, అభివృద్ది ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రెండు కళ్లలాంటివన్నారు. సరయిన వివరాలు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి రైతుబంధు పంపిణీ చేశామని… ఇప్పటికే ధాన్యం పోయడానికి కల్లాలు, తరలించడానికి వాహనాలు దొరకడంలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలో తెలంగాణ సుభిక్షంగా కనిపిస్తుందన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో ఆరేండ్లలో తిండిగింజలు లేని స్థాయి నుండి ప్రపంచానికి తిండిపెట్టే స్థాయికి చేరుకున్నాం అని…. మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా పంటల ఉత్పత్తి ఉండాలనే నియంత్రిత సాగు చేపట్టామన్నారు. వ్యవసాయం మీదనే ప్రభుత్వ ప్రధానదృష్టి .. వ్యవసాయమే అందరికీ ఆధారం .. ఈ రంగం బాగుంటేనే లోకం బాగుంటదితెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ కు చేరాలన్నారు.

చేయూతనిచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉందని .. రైతులు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులపై దృష్టి సారించాలన్నారు. వ్యవసాయం జీవనవిధానం, వ్యవసాయం ఒక సంస్కృతి…. ధరఖాస్తు చేసుకున్న అందరికీ కల్లాల నిర్మాణానికి అవకాశం ఇస్తామన్నారు.

- Advertisement -