మొక్కలు నాటిన తబలా విద్వాంసుడు జైపాల్ రాజ్

197
jaipal
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గాయకుడు దినకర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లో తన కుమారుడు ఎబినేజర్ పాల్ తో కలిసి మొక్కలు నాటిన తబలా విద్వాంసుడు జైపాల్ రాజ్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల ఈ దేశానికి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని. మనందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు అవసరమని కాబట్టి అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని కోరారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గాయకులు విజయలక్ష్మి; కౌసల్య; ఆర్పి పట్నాయక్ ;రమణ ; లీనస్ లను మొక్కలు నాటాలని ఛాలెంజ్ ఈ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ; ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

- Advertisement -