తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. శుక్రవారం రికార్డుస్ధాయిలో 1892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 20,462 పాజిటివ్ కేసులు నమోదుకాగా…283 మంది ప్రాణాలు కొల్పోయారు. రాష్ట్రం లో ఇప్పటివరకు మొత్తం 1,04,118 పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
శుక్రవారం నమోదైన పాజిటివ్ కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్‌లో1,658 కేసులు నిర్ధారణ కాగా రంగారెడ్డి జిల్లాలో 56, మేడ్చల్‌మల్కాజిగిరి 44, వరంగల్‌రూరల్ 41, సంగారెడ్డి 20, నల్లగొండ 13, మహబూబ్‌నగర్ 12, మహబూబాబాద్ 7 ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి 6 చొప్పున, వనపర్తి 5, భద్రాద్రి కొత్తగూడెం 4, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్ 3 చొప్పున, నిర్మల్, ఖ మ్మం 2 చొప్పున, కరీంనగర్, జోగుళాంబ గద్వా ల, ములుగు, జగిత్యాల, వరంగల్‌అర్బన్, నాగర్‌కర్నూల్, వికారాబాద్ 1 చొప్పున రికార్డయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమెతో పాటు ఇద్దరు సిబ్బందికి కూడా పాజిటివ్‌గా తేలింది. టెస్కాబ్ వైస్‌చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితోపాటు మరికొంత మంది సిబ్బందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉన్నది.