ఆగస్టు 15లోగా భారత్‌లో కరోనా వ్యాక్సిన్..!

318
coronavirus
- Advertisement -

కరోనాపై పోరులో ఇది శుభవార్తే…ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం నాటికల్లా భారత్‌లో కరోనా వ్యాక్సిన్ వస్తుందని ధీమా వ్యక్తం చేసింది ఐసీఎంఆర్‌. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్‌లో ముందడుగు వేశామని ప్రకటన చేయగా… వ్యాక్సిన్ మానవ ప్రయోగదశలోకి వచ్చిందని, ప్రయోగాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఐసీఎమ్మార్ తెలిపింది.

ఐసీఎంఆర్, భారత్ బయోటెక్‌ సంయుక్తంగా తయారుచేసే కొత్త కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఐసీఎంఆర్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ పేరుతో ఆగస్టు 15న మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తున్నామని…అన్ని వైద్య కళాశాలలు దీని దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు. ఎయిమ్స్ సహా దేశంలోని 13 ఆస్పత్రులు క్లినికల్ ట్రయల్స్ వేగవంతం చేయాలని, తద్వారా ఈ టీకాను నిర్ణీత సమయంలో విడుదల చేసే అవకాశముందని తెలిపారు.

భారత్ బయోటెక్‌ కంపెనీ కోవాక్సిన్ పరీక్షలు తుది దశకు చేరుకోవడంతో అన్నీ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.

- Advertisement -