మాజీ ఎంపీ కవిత చొరవతో దుబాయ్‌ నుండి తెలంగాణకు

473
dubai
- Advertisement -

దుబాయ్ లో‌ కాన్సర్ వ్యాధి తో బాధపడుతున్న నిజామాబాద్ జిల్లా కు చెందిన చెన్నారెడ్డికి మాజీ ఎంపీ ‌కల్వకుంట్ల కవిత చేయూత నిచ్చారు. చిన్నారెడ్డి స్వస్థలానికి చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయించారు. నేడు చిన్నారెడ్డి తన స్వస్థలం నిజామాబాద్ చేరుకున్నాడు.

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిన్నారెడ్డికి గత ఏడాది డిసెంబరులో క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది.మూడు నెలల క్రితం కంపెనీ నుండి తనకు రావలసిన డబ్బులు తెచ్చుకోడానికి దుబాయ్ వెళ్లాడు చిన్నారెడ్డి. అయితే కేవలం 15 రోజులకు సరిపడా మందులు మాత్రమే తీసుకెళ్లిన చిన్నారెడ్డికి లాక్ డౌన్ రూపంలో కష్టాలు మొదలయ్యాయి.

దుబాయ్ లో మందులు దొరక్క, కీమోథెరపీ జరగక ఇబ్బందులు పడ్డాడు. ఇండియా కూడా వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో చిన్నా రెడ్డి తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు.మరోవైపు అతని అనారోగ్యం విషయం తెలుసుకున్న అతని భార్య, తల్లి, ఇద్దరు కూతుళ్లు కన్నీరు మున్నీరవుతూ సహాయం కోసం ఎదురుచూసారు. తనను ఆదుకోవాల్సిందిగా, ఇండియా వెళ్లేందుకు సహాయం చేయాల్సిందిగా మాజీ ఎంపీ కవిత గారిని కోరతూ సోషల్ మీడియా ద్వారా పంపిన వీడియోలో

కోరాడు. మరోవైపు ఇదే విషయమై కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ కూడా కవితను ఈ విషయమై సంప్రదించారు. దీనిపై వెంటనే స్పందించారు మాజీ ఎంపీ కవిత. ఎంపీ కల్వకుంట్ల కవిత గారి సూచనలతో దుబాయ్ లోని ఈటీసీఏ నాయకుడు కిరణ్, చిన్నారెడ్డికి సహాయసహకారాలు అందించారు. ఫ్లైట్ టికెట్ కూడా కన్ ఫర్మ్ చేయించారు. దీంతో బుధవారం చిన్నారెడ్డి శంషాబాద్ చేరుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిన్నారెడ్డిని కలిసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు నవీన్ ఆచారి, మాజీ‌ ఎంపీ కవిత సూచనల మేరకు స్వగ్రామం వెళ్లేందుకు ‌ఏర్పాట్లు చేశారు. అనంతరం జాగృతి భాద్యుల వినతి మేరకు చిన్నా రెడ్డి తీవ్ర అనారోగ్య దృష్ట్యా, స్వగ్రామం బోర్గాంలో హోం క్వారంటైన్ లో ఉండేందుకు అధికారులు అనుమతించారు. అడిగిన వెంటనే స్పందించి , ఇండియా వచ్చేందుకు సహకరించిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకి చిన్నారెడ్డి, అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -