హైదరాబాద్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. తాజాగా హైదరాబాద్ పోలీస్ అకాడమీలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. పోలీస్ అకాడమీలో పొందుతున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి 180 మందికి పాజిటివ్‌గా అధికారులు గుర్తించారు. వారిలో 100 మంది ట్రైనీ ఎస్సైలు కాగా, మరో 80 మంది అకాడమీ సిబ్బంది ఉన్నారు. ఆశ్చర్యం ఏంటీ వీరిలో ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు లేవు. పాజిటివ్ వచ్చిన వారిని ఐసోలేషన్ లో ఉంచారు.
అకాడమీలో 1100 మందికిపైగా ఎస్ఐలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. కాగా, శిక్షణ పొందుతున్న వారితో కలిపి ఇక్కడ 2200 మందికిపైగా ఉన్నారు. అందరికీ వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం అకాడమీలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్ లు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన వారిలో ఒక ఐపీఎస్ అధికారి, ముగ్గురు అదనపు డీఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు ఉన్నట్లు సమాచారం.