ఆస్ట్రేలియాలో ఘనంగా పీవీ జయంతి..

191
Australia TRS
- Advertisement -

దక్షిణాది మొదటి ప్రధాని,విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన, బహు బాషా కోవిదుడు మన తెలంగాణ బిడ్డ పీవీ నరసింహ రావు శత జయంతి ఉత్సవాలను మన రాష్ట్ర సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు విదేశీ గడ్డపై మొదటి ఉత్సవాలను ఆస్ట్రేలియాలో మెల్బోర్న్,సిడ్నీ, కాన్బెర్రా, అడిలైడ్ ,బ్రిస్బేన్‌లలో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

మన తెలంగాణ గొప్పతనంతో పాటు, ఈ గడ్డపై జన్మించిన మన ఆణిముత్యాలను గుర్తించి ప్రపంచానికి తెలియజేయడంలో భాగంగా పీవీ జయంతిని సంవత్సరం పాటు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 50 దేశాలలో ఘనంగా నిర్వహించ తలపెట్టిన కెసిఆర్‌కు కాసర్ల నాగేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులందరు పీవీ చిత్రపటానికి పుష్పాలు సమర్పించుకుని పీవీని స్మరించుకున్నారు.

విక్టోరియా ఇంచార్జి ఉప్పు సాయి రామ్ మాట్లాడుతూ ” భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి పీవీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని పాలించి, ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నాయకుడు పీవీ కానీ పీవీకి దక్కాల్సిన ఏ గౌరవాన్ని కూడా దక్కకుండా చేసింది ఆయన సొంత పార్టీ కాంగ్రెస్.

ఇప్పుడు మన తెలంగాణలో వారికి పూర్వ గౌరవాన్ని తీసుకువస్తూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. అందులో ముఖ్యంగా వెటర్నరీ యూనివర్సిటీ పీవీ పేరుతో సత్కరించడం చాలా శుభ పరిణామం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డా అర్జున్ చల్లగుళ్ళ, సనిల్ బసిరెడ్డి,శివ హైదరాబాద్, సతీష్ పులిపాక, నిశాంత్ గుర్రం, ఆకాష్ రెడ్డి మెతుకు, అశోక్ రెడ్డి కుబ్బి, భార్గవ్ జొన్నవలస తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -