టీఆర్‌ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అధ్యక్షతన మంత్రి కెటిఆర్ సమక్షంలో 51 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతాబ్ది జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ మలేషియా మరియు మలేషియా తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ కోర్ కమిటీ సభ్యులతో కలిసి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతాబ్ది జయంతి ఉత్సవాలను మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన కృషిని గుర్తించిన కెసిఆర్ వారికి తగిన గుర్తింపు నివ్వడం చాలా సంతోషంగా ఉందని, అందుకు కెసిఆర్‌కి తెరాస మలేషియా తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అలాగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతాబ్ది జయంతి ఉత్సవాల కమిటీ సభ్యునిగా నియమితులైన టీఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకి టీఆర్‌ఎస్ మలేషియా తరపున హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సైదం తిరుపతి, తెరాస మలేషియా ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు రమేష్ గౌరు, మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి,గద్దె జీవన్ కుమార్, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, హరీష్ గుడిపాటి, శ్రీనివాస్ ముల్కల, సాయి హేమంత్, రఘునాత్ నాగబండి, ఓంప్రకాష్ బెజ్జంకి,దిలీప్ కపిడి, రాజేష్ పాల్గొనడం జరిగింది.