- Advertisement -
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం 5గంటల నుంచి ప్రారంభమైన వర్షం 7.30నిముషాల వరకు ఎడతెరపి లేకుండా కురిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. హైదరాబాద్ లోని పంజాగుట్ట, సికింద్రబాద్, అమీర్ పేట, కూకట్ పల్లి, బాలా నగర్ , ఎల్బీనగర్, ఉప్పల్, నాంపల్లిలో భారీగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురుస్తుంది.నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సమాచారం తో ఫీల్డ్ లో ఉండే అన్ని టీంలను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ.
- Advertisement -