సీఎం కేసీఆర్‌కు నేవీ వైస్ అడ్మిరల్ అభినందన లేఖ…

216
cm kcr
- Advertisement -

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వ రూ.5కోట్ల ఆర్థికసాయం, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 711 గజాల ఇంటి స్థలం ఇచ్చింది.తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నేవీ వైస్ అడ్మిరల్ అభినందన లేఖ…కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ అభినందన లేఖ రాశారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన ఓ అమరవీరుడి కుటుంబానికి ముఖ్యమంత్రి చూపిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు.ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ఏకంగా వందల కిలోమీటర్లు వెళ్లి కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడం అంటే మామూలు విషయం కాదన్నారు. తెలంగాణ సీఎం చూపిన దారి దేశానికే ఆదర్శమన్నారు.

సంతోష్ బాబు కుటుంబానికి అత్యున్నతమైన ప్యాకేజీని అందించడం ద్వారా మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్‌‌ను ఓ సారి సందర్శించవలసిందిగా సీఎం కేసీఆర్‌ను వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ ఆహ్వానించారు. ఎందరో సైనికులను తయారు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థలో తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఉన్నారని ప్రస్తావించారు.

- Advertisement -