వదిన సెంటిమెంట్ తో కొట్టారు..!

234
- Advertisement -

చాలా రోజులుగా పవన్ కల్యాణ్ మెగా హీరోలతో అంటిముట్టనట్టు ఉంటున్నాడు. గబ్బర్ సింగ్ టైమ్ లో అంతా ఏకమైనట్టు కనిపించినా.. మళ్లీ పవన్ లో మార్పువచ్చింది. బాబాయ్ ను ప్రసన్నం చేసుకోవాలని చరణ్ ఎంత ట్రై చేస్తున్నా.. పవన్ మాత్రం మెట్టుదిగలేదు. దీంతో ధృవ మూవీ టైంలో పవన్ విషయంలో చరణ్ మిన్నకుండిపోయాడు. అదే సమయంలో నటుడు సప్తగిరికి ఇచ్చిన మాటకోసం.. అతని మూవీ ఆడియో ఫంక్షన్ కు పవన్ వెళ్లడం చరణ్ ను మరింత ఇబ్బందిపెట్టింది.

Mrs Chiranjeevi To Invite Pawan Personally

అయితే.. తండ్రి 150 మూవీ కోసం చరణ్ మరోసారి పవన్ గడపలో అడుగు పెట్టక తప్పలేదు. బాబాయ్ ని పిలిచి, ఆడియో రిలీజ్ వేడుక జరపాలని భావించిన చరణ్ కు మళ్లీ భంగపాటు ఎదురైంది. అభిమానుల నుంచి ఎదురయ్యే ప్రశ్నలను తట్టుకోవాలంటే.. ప్రీ రిలీజ్ వేడుక కోసం పవన్ హాజరుకావడం తప్పని సరి. అందుకే తాము చెబితే వినడని భావించిన మెగా హీరోలు.. పవర్ స్టార్ ను ఆహ్వానించేందుకు సెంటిమెంట్ గా చిరు సతీమణి సురేఖను రంగంలోకి దించారు. సురేఖ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి హాయ్ ల్యాండ్‌లో జరిగే వేడుకకు రావాలని ఆహ్వానించనున్నట్టు సమాచారం. తల్లిలా భావించే వదిన పిలిస్తే, పవన్ తప్పకుండా ప్రీ రిలీజ్ కు వస్తాడని మెగా హీరోల ప్లాన్. మరీ వదిన ఆహ్వానాన్ని పవన్ మన్నిస్తాడా? మళ్లీ మెగా బ్రదర్స్ ఓకే వేదికపై కనిపిస్తారా? లేదా తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చెయ్యక తప్పదు.

- Advertisement -