సమంత స్ట్రైకింగ్ యోగా ఫోజ్

293
samantha
- Advertisement -

ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు తన ఫిట్‌నెస్ పై ప్రత్యేక దృష్టిసారించే బ్యూటీ సమంత. సినిమా సినిమాకి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులకు థ్రిల్‌ అందిస్తున్న సామ్‌..ఫిట్ నెస్‌ కోసం కూడా చాలా శ్రమపడుతోంది.

ఎప్పటికప్పుడు తాను చేసే వర్కవుట్‌కి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్న సామ్ తాజాగా తన ఫిట్ నెస్‌కి సంబంధించిన ఫోటోని షేర్ చేసింది. రెండు చేతులు భూమిపై ఉంచుతూ బాడీని గాలిలో బ్యాలెన్స్ చేస్తూ కష్టపడుతోంది సామ్.తోటపని కాకుండా.. నేను యోగాను కూడా అమితంగా ఆస్వాదిస్తాను. ఎందుకంటే యోగా నేను చైతన్యతో కలిసి చేస్తాను. మాకు ఒక సూపర్‌ బెస్ట్‌ ట్రైనర్‌కూడా ఉన్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య లేరు.. నేనొక్కదానే యోగా చేస్తున్నాను వెల్లడించింది సమంత. ప్రస్తుతం సామ్‌కు సంబంధించిన ఈ స్ట్రైకింగ్ యోగా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక గతంలో సమంతకు సంబంధించిన ఫిట్ నెస్ ఫోటోలు,వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఓ పోల్ ద్వారా పైకి ఎక్కుతూ తన బాడీని బ్యాలెన్స్ చేస్తూ సమంత చేసిన అమేజింగ్ స్టంట్‌కు నెటిజన్లే కాదు అంతా ఫిదా అయిపోయారు.

- Advertisement -