నాటిన ప్రతిచెట్టును బ్రతికించాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ మండలం అన్నేపర్తి గ్రామం వద్ద అద్దంకి.. టూ నార్కెట్ పల్లి హైవే పై హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మంత్రి జగదీశ్ రెడ్డి,ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,జడ్పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ పాటిల్, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి,టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, డీఎఫ్‌వో శాంత రాం,ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి,ఎమ్మార్వో నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి…ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం..భూమిపై 33శాతం అడవి ఉండాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆరు శాతం కూడా లేదు.జూన్ మాసంలోను ఎండలు కొడుతున్నాయంటే పర్యావరణ సమతుల్యత లోపించడమే కారణం అన్నారు.
ఈ ప్రమాదం నుంచి బయట పడడానికి హరితహారం ఒక్కటే మార్గం..ప్రజా ఉద్యమంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం తీసుకొచ్చారు.ఇది ప్రభుత్వం, ఆయా శాఖల బాధ్యత మాత్రమే కాదు.ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు.
ఆరేళ్లుగా హరితహారంలో నాటిన మొక్కలు ఫలితాలు ఇస్తున్నాయి…హైవేలపై పచ్చదనం కూడా సీఎం కృషినే…అందుకే వీధివీధికి ,, అన్ని రహదారుల వెంట చెట్లు పెట్టాలన్నది లక్ష్యం.పెట్టిన ప్రతి చెట్టు… బతికించాలన్నారు. ఇదే ప్రజల ముందు ఉన్న కర్తవ్యం.రేపటి తరాలకు చెట్లు ఇవ్వాలి. అక్షిజన్ ఇవ్వాలన్నారు.
హరితహారం గొప్ప కార్యక్రమం….సీఎం కేసీఆర్ మనసపుత్రిక ఈ హరితహారం కార్యక్రమం అన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్టాల్లోనూ మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇచ్చారు…మానవాళి భవిష్యత్ కి మొక్కల పెంపకం చాలా కీలకం.ఫారెస్ట్ భూముల ఆక్రమణ కూడా సరికాదన్నారు. హరితహారంలో ప్రజలు ,ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావాలన్నారు.