దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 17,296 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇదే రికార్డు.
24 గంటల్లో 407 మంది మృతిచెందగా ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 17,296కి చేరింది. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య 4,90,401కి చేరగా యాక్టివ్ కేసులు 1,89,463 ఉన్నాయి. కరోనా మహమ్మారి నుండి 2,85,637 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక దేశంలో కరోనా కేసుల్లో అగ్రస్ధానంలో మహారాష్ట్ర ఉంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1,47,741 పాజిటివ్ కేసులు నమోదుకాగా గత 24 గంటల్లో 4841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 73,780కి చేరగా ఇప్పటివరకు 2429 మంది బాధితులు మృతి చెందారు. తమిళనాడులో ఇప్పటివరకు 70,977 పాజిటివ్ కేసులు నమోదవగా, 911 మంది మృతిచెందారు. ఇక తెలంగాణలో 11,364 కరోనా కేసులు నమోదయ్యాయి.