- Advertisement -
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బొగ్గుగనుల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 26న హైదరాబాద్లోని సింగరేణి భవన్ ఎదురుగా నిరసన వ్యక్తం చేస్తున్న టీబీజీకేఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (Reg no.140/2018) సంపూర్ణ మద్దతు తెలియజేస్తోంది.
ఈ నిరసన కార్యక్రమంలో మా అసోసియేషన్ నుంచి కూడా అధిక సంఖ్యలో పాలుపంచుకుంటామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా జూలై 2న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కల్వకుంట్ల కవితతో కలిసి మా అసోసియేషన్ సభ్యులు కూడా సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలియజేయాలని సింగరేణి లోని 15 వేల మంది ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల తరఫున నిర్ణయించామని తెలిపారు సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈ. రాజేశ్వర్.
- Advertisement -