అల్లనేరేడు మొక్క నాటిన సీఎం కేసీఆర్

682
kcr haritha haram
- Advertisement -

ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ ప్రాంతంలో నేరేడు మొక్కను నాటి ప్రారంభించారు. 630 ఎకరాల్లో అభివృద్ది చేసిన నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నర్సాపూర్ అడవుల్లో చేపట్టిన అటవీ అడవి పునరుద్ధరణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. అటవీ ప్రాంతంలో కాలి నడకన తిరుగుతూ అడవి పునరద్దరణ కోసం చేపట్టిన చర్యలను పరిశీలించారు.

నేచురల్ ఫారెస్ట్, రాక్ ఫిల్ డ్యాం, వాటర్ హార్వెస్టింగ్ తదితర పనులను పరిశీలించారు. ఎతైన కొండపై నిర్మించిన వాచ్ టవర్ నుండి ముఖ్యమంత్రి అటవీ ప్రాంతాన్నంతా సందర్శించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలయిన ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం అడవి ఉందని, ఆ ప్రాంతం కాక దట్టమైన అడవి వున్న ఎకైక ప్రాంతం రాష్రంత్లో నర్సాపూర్ మాత్రమేనని ముఖ్యమంత్రి అన్నారు. ఈ అడవిని కాపాడుకోవడానికి, అటవీ ప్రాంతంలో పోయిన అడవిని పునరుద్ధరించడానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు.

- Advertisement -