- Advertisement -
ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ స్ధానానికి అభ్యర్ధిగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును ఖరారు చేశారు సీఎం జగన్. మార్చి 9న టీడీపీకి ,ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన డొక్కా….సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
దీంతో ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్ధానానికి త్వరలో ఎన్నికలు జరగనుండగా తిరిగి ఆయనకే అవకాశం కల్పించారు జగన్. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు డొక్కా.
గురువారం నామినేషన్ గడువు చివరి రోజు కావడంతో డొక్కా వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అధిక సంఖ్యలో ఉండడంతో డొక్కా ఎన్నిక లాంఛనం కానున్నది.
- Advertisement -