ఆసుపత్రి పాలైన సీనియర్ కొరియోగ్రాఫర్..!

197
Choreographer Saroj Khan
- Advertisement -

బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఆమె శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో ముంబైలోని గురునానక్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్‌కు శ్వాస సబంధిత సమస్యలు తలెత్తడంతో కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో ఆమెను వైద్య పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తు కరోనా నెగటివ్ అని వచ్చిందట. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

సరోజ్ ఖాన్‌ 1980-90 దశకంలో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆమె శ్రీదేవి, మాధురి దీక్షిత్‌ వంటి పాప్యులర్ హీరోయిన్లతో అదిరిపోయేలా స్టెప్పులు వేయించారు. దేవదాస్ సినిమాలోని ‘డోలా రే డోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ ‘ఏక్ దో తీన్’, ‘జబ్ వీ మెట్’ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి గాను ఆమె జాతీయ అవార్డులు అందుకున్నారు. సరోజ్ ఖాన్ చివరిసారి మాధురి దీక్షిత్ నటించిన ‘కలంక్‌’ సినిమాలోని కొన్ని పాటలకు నృత్య దర్శకత్వం వహించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు సరోజ్ ఖాన్ విశేషమైన సేవలందించారు.

- Advertisement -