విజయ్ తో రష్మీక మందన రొమాన్స్

257
rashmika mandana
- Advertisement -

కన్నడ ముద్దుగుమ్మ రష్మీక మందన వరుస విజయాలతో దూసుకుపోతుంది. వరుసగా స్టార్ హీరోలతో ఛాన్స్ లు కొట్టేస్తుంది. ఇటివలే తెలుగులో మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి సక్సెస్ సాధించింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప మూవీలో కూడా నటిస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ లో అమ్మడు చాలా బీజీగా ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోల సరసన వరుసగా సినిమాలు చేస్తుంది.

తాజాగా తమిళ్ లో మరో స్టార్ హీరో సరసన అవకాశం దక్కించుకుంది రష్మీక. తమిళ్ స్టార్ దర్శకుడు మురుగదాస్ విజయ్ దళపతి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈమూవీలో రష్మీకను హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఈవిషయాన్ని త్వరలోనే చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. త్వరలోనే ఈమూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభకానున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు రష్మీక నటించిన సినిమాలు అన్ని హిట్ కావడంతో ఆమె గొల్డెన్ గా మారింది.

- Advertisement -