వెబ్ వరల్డ్ లోకి దర్శకుడు గుణశేఖర్

193
director gunashekar
- Advertisement -

ఓటీటీ ప్లాప్ ఫామ్ వచ్చినప్పటి నుంచి స్టార్ హీరో, హీరోయిన్లు, నటీనటులు సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ లుసైతం వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహిస్తున్నారు. ఓటీటీలకు బాగా డిమాండ్ పెరగడంతో నిర్మాతలు స్టార్ దర్శకులతో వెబ్ సిరీస్ లు తీయిస్తున్నారు. కరోనా దెబ్బకు థియేటర్లు మూత పడటంతో ఓటీటీ ప్లాట్ ఫాంలకు డిమాండ్ పెరిగింది. ఇంట్లో ఖాళీగా ఉండటంతో ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు జనాలు. ఇప్ప‌టికే నందినిరెడ్డి, త‌రుణ్ భాస్క‌ర్‌, సంక‌ల్ప్‌రెడ్డి,క్రిష్ ఓటీటీల కోసం వెబ్ సిరీస్‌లు చేశారు.

తాజాగా మరో స్టార్ దర్శకుడు కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. ఈ వెబ్ సిరీస్ ను ఆయనే నిర్మించనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈవెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. కాగా గుణ శేఖర్ ప్రస్తుతం రానాతో హిరణ్యకశ్యప అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఈమూవీ షూటింగ్ వాయిదా పడింది. ఈమూవీతో పాటు వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కించనున్నారు దర్శకుడు గుణశేఖర్

- Advertisement -