- Advertisement -
వైసీపీ నాయకురాలు,అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ సాధారణ రైతు కుటుంబం నుండి ఎంపీగా గెలుపొందిన మాధవి…తన మూలాలు మర్చిపోలేదు. తండ్రి మాజీ ఎమ్మెల్యే దేముడు బాటలోనే పొలం బాటపట్టారు.
తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమిలో వ్యవసాయ పనులు చేస్తూ ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. దుక్కి దున్నుతూ ఎందరో రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు మాధవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవలె తన చిన్ననాటి స్నేహితుడు సెయింట్ థెరిసా కళాశాల కరస్పాండెంట్ శివప్రసాద్‌ను పెళ్లి చేసుకున్నారు మాధవి. పార్టీ నేతలు,కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
- Advertisement -